విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత రెండు రోజుల్లో బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది.
అలాగే మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని దీనికి ఎండ తీవ్రత కూడా తోడయ్యిందన్నారు. ఈ ప్రభావంతోనే మంగళవారం ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురిశాయని... రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం లోని వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ తో పాటు పక్కరాష్ట్రం తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు.గత రెండు మూడు రోజుల నుండి ఎండ ప్రభావం తగ్గి ఆకాశం మేఘావృతం అయి వుంటోంది.ఇలా వర్షాలు మరిన్ని రోజులు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.